ఈ భూమి మీద ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయి.ఇలాంటి ఎన్నో ఔషధమైన మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి.
ఈ ఔషధ మొక్కలను ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు.వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం ఇలాంటి ఔషధా మొక్కలను అస్సలు వదలరు.
ఇలా మన చుట్టూ ఉండే ఔషధ మొక్కలలో తుమ్మ చెట్టు కూడా ఒకటి.కానీ నల్ల బెరడు, పసుపు రంగు పూలు, పొడువాటి కాయలు, చిన్నచిన్న ఆకులను ఈ చెట్టు కలిగి ఉంటుంది.
ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు వివిధ రకాల ఫర్నిచర్ ను తయారు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా నల్ల తుమ్మ చెట్టులో అధికంగా ఈ ఔషధ గుణాలు ఉన్నాయి.
నల్ల తుమ్మ చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ చెట్టును ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నల్ల తుమ్మ బెరడుతో పాటు దాని జిగురును, కాయను ఈ మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.అలాగే నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి.
లేత నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్గా చేసుకుని తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి.అలాగే నల్ల తుమ్మ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఆ పొడిని తగినన్ని నీళ్లు అలాగే కండే చక్కర ను కలిపి పేస్టులా చేసుకుని తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.
నల్ల తుమ్మ చిగురును కూడా నోట్లో కొద్దిసేపు ఉంచుకొని ఉమ్మి వేయాలి.ఇలా చేయడం వల్ల నోటి సమస్యలు, నోటి పూత లాంటి సమస్యలు దూరం అవుతాయి.
నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగాలి.ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.