ఆంధ్రప్రదేశ్ విభజనపై వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.రాష్ట్ర విభజన సమ్మతమేనని వైసీపీ ఉత్తరాలు ఇచ్చిందని చెప్పారు.
రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం అని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే పరిస్థితే లేదన్నారు.
జగన్, కేసీఆర్ లు పరస్పరం సహకరించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రెండు రాష్ట్రాలకు జై కొట్టిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.
అనంతరం కొత్త పొత్తుల కోసం తాము ప్రయత్నించడం లేదని వెల్లడించారు.