యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో మహానుభావులు అమరులైనారని,అమరులైన అమర వీరుల ఆశయాలను కొనసాగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ సహయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ అన్నారు.శుక్రవారం సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యంతో కలిసి మోటకొండూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల వారోత్సవాలో పాల్గొన్నారు.
మోటకొండూరులో రెడ్డిగంటి శేషయ్య, కాటేపెల్లిలో మచ్చ శ్రీహరి, ఎలగందుల శ్రీరాములు, ముత్తిరెడ్డిగూడెంలో బండి జగన్నాథం,కొమ్మగాని స్వామి,చాడలో శనిగారం సత్తయ్య,మాటూరు పెద్దబాయి ఎరబోయిన రాంచంద్రయ్య, మాటూరులో కోళ్ల పాపయ్యల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిజాం నిరంకుశ పాలనకు ఫ్యూడల్ వ్యవస్థ అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఆమరవీరుల అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.
తెలంగాణా సాయుధ పోరాటంలో కారంపొడి, రోకలి బండలతో ప్రజలు తిరగబాటు పోరాటంలో నిజాం,దొరల భూస్వాముల, పెత్తందారుల కబ్బందాస్తాల్లో నుండి ఒక్కొక్క గ్రామాన్ని విముక్తి చేస్తూ సుమారు 3000 గ్రామాలను విముక్తి చేయబడ్డాయని, భూస్వాముల నుండి 10 వేల ఎకరాల భూములు పేదలకు పంచబడినదని తెలిపారు.ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు,సిపిఐ మోటకొండూరు మండల సహాయ కార్యదర్శులు ముసుకు పెంటారెడ్డి, ఆలేటి బాలరాజు,మండల కార్యవర్గ సభ్యులు పసుల నరసింహ,బోల శ్రీనివాసు, మంచాల రాధమ్మ, బొలగాని అశోక్, జీవకలపల్లి పాండు, సూర్యనారాయణ,పిట్టల కరుణాకర్,పరశురాం,నల్ల రాములు,కోళ్ల భిక్షపతి, చంద్రమౌళి,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.