వికలాంగురాలికి ప్రేమించిన సకలాంగుడితో వివాహం

సూర్యాపేట జిల్లా:ప్రేమ పేరుతో వికలాంగ మహిళలను మోసం చేస్తే ఎంతటి ఉద్యమానికైనా వెనకడుగు వేయబోమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు.ఆదివారం మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన వికలాంగురాలు మిట్ట గడపల రమాదేవి అదే గ్రామానికి చెందిన సకలాంగుడు సాలె బాలస్వామికి మండల కేంద్రంలోని రామాలయంలో ప్రేమ వివాహం జరిపించారు.

 Married To A Gay Man Who Loves A Disabled Woman-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రమాదేవి,బాలస్వామి ప్రేమించుకుంటున్నారని,వివాహం చేసుకోవాలని వికలాంగురాలైన రమాదేవి బాలస్వామిని అడగడంతో అందుకు బాలస్వామి నిరాకరించాడని,ఈ విషయాన్ని రమాదేవి కుటుంబ సభ్యులు తమ దృష్టికి తీసుకురావడంతో ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన బాలస్వామిపై మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో బాలస్వామికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి,ఇద్దరినీ ఒప్పించి,మెప్పించి ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం జరిపించామన్నారు.

ప్రేమ పేరుతో వికలాంగ మహిళలను మోసం చేస్తే సహించేది లేదన్నారు.వివాహం చేసుకున్న జంటకు శుభాాంకాంక్షలు తెలిపారు.

ఇలాంటి ప్రేమ వివాహలు చేసుకునే వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.ఈ వివాహ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు కత్తి వెంకటేశ్వర్లు, నారాయణగూడెం గ్రామ నాయకులు స్టాలిన్ రెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు,బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ గుండెపంగు రమేష్,నారాయణగూడెం గ్రామ ఎంపీటీసీ రోశయ్య,గ్రామ ఉపసర్పంచ్,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య,భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి,జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా మధు యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు జూకంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube