తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు భీమిరెడ్డి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీ.ఎన్ రెడ్డి శత జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఆత్మకూర్ (ఎస్)మండలం తుమ్మల పెన్ పహాడ్ క్రాస్ రోడ్ లో బీ.ఎన్ రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించ్చారు.అనంతరం దాచారం గ్రామంలో బిఎన్ స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించారు.

 The Warrior Who Introduced Telangana To The World Was Bheemireddy , Bheemireddy,-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బీ.ఎన్ రెడ్డి అని కొనియాడారు.తెలంగాణ సమాజం స్వేచ్చగా ఉందంటే దానికి కారణం బిఎన్ పోరాట ఫలితమేనని అన్నారు.వితంతువును వివాహమాడిన ఆదర్శమూర్తి భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు.అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉందని గుర్తు చేశారు.విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా మలుపు తిప్పిన వ్యూహకర్త బిఎన్ రెడ్డి అన్నారు.

బిఎన్ జీవితం నేటి తరానికి ఆదర్శం,స్పూర్తి వంతం అన్నారు.రాజకీయంగా విభేదించినా,బిఎన్ ను అభిమానించే లక్షలాది మందిలో నేను ఒకడినని, బిఎన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

తుంగతుర్తి,సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకు రావాలనే బిఎన్ చిరకాల వాంఛను నేరవెర్చిన ఖ్యాతి,ఘనత,ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుల మోసానికి బలైన నాయకుడు బిఎన్ అన్నారు.

ఆయన ఇచ్చిన చైతన్యంతోనే దేశంలో అన్ని చోట్లా కుల,మత వివాదాలు ఉన్నా, తెలంగాణలో లేవన్నారు.బిఎన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం అని మంత్రి అన్నారు.

బిఎన్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని అన్నారు.బిఎన్ స్పూర్తితో తెలంగాణలో ఆకలి కేకలు మటుమాయం అన్నారు.

ప్రాజెక్టులకు బిఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మకూర్ (ఎస్) మండల ఎంపిపి స్వర్ణలత చంద్రారెడ్డి, పీఏసిఎస్ చైర్మన్ కొణతం సత్యనారయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహ రావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్,మాజీ ఎంపిపి బ్రహ్మం,శిల్పి శ్రీనివాస్ రెడ్డి, బిఎన్ కుమారుడు ప్రభాకర్ రెడ్డి,మేనళ్లులు, మండల సర్పంచ్ లు, ఎంపిటిసిలు,ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube