సాయం కోసం ఎదురుచూపులు

సూర్యాపేట జిల్లా:ఆదుకోండి సారూ అంటూ ఓ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న దీనస్థితి ఆ పేద కుటుంబం అర్థాకలితో అలమటిస్తున్న బతుకు చిత్రం పలువురిని ఆలోచింప జేస్తుంది.అర్థాకలితో అలమటిస్తున్న కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు,కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 Expectations For Help-TeluguStop.com

ఒకే పెన్షన్‌తో నలుగురు జీవనం గడపటానికి నానా కష్టాలు పడుతున్నారు.వివరాల్లోకి వెళితే…జిల్లా కేంద్రంలోని 39వవార్డు సందు బావికి చెందిన కోల శ్రీను మిషన్‌ మెకానిక్‌.

ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన వినోదతో 2004లో వివాహం జరిగింది.వీరికి ఒక పాప,ఒక బాబు ఉన్నారు.

ఉండటానికి ఇల్లు కూడా సరిగాలేదు.నలుగురు వెలితే నిలబడటానికి చోటు కూడా ఉండదు.

వారింట్లో ఒక చిన్న ఫ్యాన్‌,ఒక బల్బు మాత్రమే ఉంటుంది.వినోద ఎడమ కాలుకు పోలియో బారినపడి అంగవైకల్యంతో బాధపడుతుంది.శ్రీను మిషన్‌ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.2018లో వీరికి ఒక నెల కరెంట్‌ బిల్‌ రూ.9600 రాగా బీపీ ఎక్కువై టెన్షన్ తో కుడి కాలు,కుడి చేతికి పక్ష వాతం వచ్చి,నాటి నుంచి నేటి వరకు మంచానికే పరిమితమయ్యాడని బాధితులు తెలిపారు.వికలాంగుల సర్టిఫికెట్‌ తీసుకొని మున్సిపాలిటీలో 2 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేయగా నేటి పెన్షన్‌ రావడం లేదని వాపోతున్నారు.

వినోదకు వచ్చే పెన్షన్‌తో భర్త,పిల్లలను సాకుతుంది.ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్‌ బియ్యంతోనే పూట గడపుతున్నారు.

పిల్లలు చరణ్‌ తేజ 4వ తరగతి, నిత్యశ్రీ 1 వ తరగతి వికాస్‌ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు.ఫీజు కట్టేందుకు,మందులు వాడేందుకు,కుటుంబ పోషణకు పెన్షన్‌ డబ్బులు సరిపోవడం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేస్తుంది.

దాతలు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.ఆర్థిక సాయం చేయదలచిన వారు 9603383074, 9948207525 నంబర్‌లను సంప్రదించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube