మాతృత్వానికి మచ్చ తెచ్చే సంఘటన...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సోమవారం తెల్లవారు జామున హృదయవిధారక సంఘటన వెలుగులోకి వచ్చింది.గ్రామంలో గుర్తు తెలియని ఓ తల్లి అప్పుడే పుట్టిన ఆడ శిశువును అర్థరాత్రి ఊరి బయట చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళింది.

 An Incident That Will Stain Motherhood , Motherhood-TeluguStop.com

బహిర్భూమికి వెళ్ళిన కొందరు మహిళలకు ఆ పసి గుడ్డు ఆర్తనాదాలు,అరుపులు వినిపించడంతో కంగారు పడి చూడగా కళ్ళుతెరవని శిశువు కనిపించింది.దీనితో వారు ఆ పసి బిడ్డను బయటికి తెచ్చి 108 సిబ్బందికి సమాచారం అందివ్వగా వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది రమేష్,చిరంజీవి ప్రథమ చికిత్స చేస్తూ ఆ బిడ్డను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చేర్చి,మాతా శిశు ఆసుపత్రికి అందజేశారు.

ప్రస్తుతం పాప క్షేమంగా,ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ఈఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిడ్డను పారేసిన తల్లికి శాపనార్థాలు పెట్టారు.

ఆడపిల్లను వదిలించుకోవాలని చూసిన ఆ కసాయి తల్లి ఎవరని ఆరా తీస్తున్నారు.ఆడపిల్లలు లేకుంటే సమాజంలో మగవారు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube