మాతృత్వానికి మచ్చ తెచ్చే సంఘటన…!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సోమవారం తెల్లవారు జామున హృదయవిధారక సంఘటన వెలుగులోకి వచ్చింది.

గ్రామంలో గుర్తు తెలియని ఓ తల్లి అప్పుడే పుట్టిన ఆడ శిశువును అర్థరాత్రి ఊరి బయట చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళింది.

బహిర్భూమికి వెళ్ళిన కొందరు మహిళలకు ఆ పసి గుడ్డు ఆర్తనాదాలు,అరుపులు వినిపించడంతో కంగారు పడి చూడగా కళ్ళుతెరవని శిశువు కనిపించింది.

దీనితో వారు ఆ పసి బిడ్డను బయటికి తెచ్చి 108 సిబ్బందికి సమాచారం అందివ్వగా వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది రమేష్,చిరంజీవి ప్రథమ చికిత్స చేస్తూ ఆ బిడ్డను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చేర్చి,మాతా శిశు ఆసుపత్రికి అందజేశారు.

ప్రస్తుతం పాప క్షేమంగా,ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ఈఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిడ్డను పారేసిన తల్లికి శాపనార్థాలు పెట్టారు.

ఆడపిల్లను వదిలించుకోవాలని చూసిన ఆ కసాయి తల్లి ఎవరని ఆరా తీస్తున్నారు.ఆడపిల్లలు లేకుంటే సమాజంలో మగవారు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?