కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్ సర్కార్:చెవిటి వెంకన్న యాదవ్,డీసిసి ప్రెసిడెంట్

సూర్యాపేట జిల్లా:వరి ధాన్యాలు కొనుగోలు చేస్తామంటూ కేసీఆర్ సర్కార్ ప్రకటిండం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళనలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించక తప్పలేదన్నారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెట్రోలు,డీజిల్,గ్యాస్ ధరలు,విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వద్దకు దిగి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుదని,ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాల మెడలు వంచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల తోడు ఉంటుందని స్పష్టం చేశారు.

క్షమించండి.. తప్పు చేశాను.. అలేఖ్య చిట్టి సంచలన వీడియో