భావితరాలకు నైతిక విలువలు నేర్పాలి:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆదివారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కోదాడ పట్టణంలోని ఆర్.ఎస్.

 Moral Values Should Be Taught To Future Generations: District Sp-TeluguStop.com

వి ఫంక్షన్ హాల్ నందు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం మతసామరస్యానికి నిలయమని,అన్ని రకాల ఉత్సవాలను ప్రజలందరూ కలిసిమెలిసి సోదరా భావంతో జరుపుకుంటున్నారని అన్నారు.

గణేష్ నవరాత్రులు జిల్లాలో సామరస్యంగా జరుపుకోవాలని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు.గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ ప్రటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని,ప్రజలు సంతోషంగా ఉత్సవాలు జరుపుకోవచ్చని తెలిపారు.

మన భావితరాలకు విలువలు,నైతికత,దేశం యొక్క గొప్పతనం, పండుగల యొక్క గొప్పతనం,మన సంస్కృతి, సాంప్రదాయాలు,ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండటం తెలుపుతూ పెంచాలని,పెద్దలను గౌరవించే విధంగా ఆది నుండే వారిలో సద్భావన కలిగే విధమైన మంచి నేర్పించాలని సూచించారు.గణేష్ నవరాత్రులు మతసామరస్యానికి ప్రతీక అని,అందరూ కలిసి ఇక్కడ పండగ జరుపుకోవడం చాలా మంచి విషయమని,ఆనందకరమైన విషయమన్నారు.

శోభాయాత్రకు సంబంధించి,నిమర్జనానికి సంబంధించి జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసిందని, పోలీసు వారి సూచనలు పాటిస్తూ ఉత్సవ కమిటీలు శోభాయాత్రను నిర్వహించుకోవాలని,నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిమర్జనం చేసుకోవాలని కోరారు.ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్త పడాలని అన్నారు.

అనంతరం కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ నగర్ నందు గణేష్ మండపాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రజలకు అన్నదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి,సిఐలు శివశంకర్,ఆంజనేయులు, ప్రసాద్,కోదాడ సబ్ డివిజన్ ఎస్ఐలు,సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు,శాంతి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube