నల్లగొండ జిల్లా:త్వరలో భారత్లో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రయత్నిస్తోంది.దేశంలో సేవలు అందించాలంటే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది.
సున్నిత,సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండాలని షరతు విధించింది.కంట్రోల్ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తిన సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తుంది.