ఓయూ డాక్టరేట్ పొందిన సంచార జాతి బిడ్డ తాళ్ళ శ్రీను...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ సంచార జాతికి చెందిన తాళ్ళ శ్రీను( Thala Srinu ) ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగంలో డాక్టరేట్ సాధించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.ఆచార్య ఎం గోనానాయక్ పర్యవేక్షణలో “భిక్షుకుంట్ల వారి మౌఖిక సాహిత్యం- సంస్కృతి” అనే అంశంపై శ్రీను పరిశోధన పూర్తి చేసి సమర్పించగా పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పి.

 Thala Srinu, A Nomadic Child Who Got Doctorate From Ou , Ou, Thala Srinu, Osmani-TeluguStop.com

హెచ్.డి పట్టాను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

తాళ్ళ శ్రీను తెలుగు విభాగంలో జాతీయ స్థాయి ఫెలోషిప్ కు ఎంపికై పట్టుదలే ఆయుధంగా పిహెచ్ డీ పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆయనను పలువురు విద్యార్థి నాయకులు,పరిశోధక విద్యార్థులు,సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube