మ‌గ‌వారికి ఆ అల‌వాట్లు ఉంటే పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేన‌ట‌!

ఇటీవ‌ల రోజుల్లో ఎంద‌రో దంప‌తులు సంతానలేమితో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.సంతానం కలుగకపోతే కేవలం భార్యదే తప్పు అనే అప‌న‌మ్మ‌కం ఎంద‌రిలోనో ఉంది.

 Its Hard To Have Children If Men Have Those Habits Details! Children, Bad Habits-TeluguStop.com

నేటి ఆధునిక వైద్య విధానంలో అలాంటి అపోహలకు తావులేకుండా ఎవరిలో లోపం ఉందనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు.అయినాస‌రే చాలా మంది ఈ సమస్యకి కేవలం మహిళలను మాత్రమే కారణంగా చూపితుంటారు.

నిజానికి ఆడ‌వారిలో ఉండే ఫర్టిలిటీ స‌మ‌స్య‌లే కాదు మ‌గ‌వారికి ఉండే కొన్ని కొన్ని అల‌వాట్లు కూడా సంతాన‌లేమికి కార‌ణం అవుతుంటాయి.

ముఖ్యంగా మ‌ద్యపానం, ధూమ‌పానం.

ఈ రెండు అల‌వాట్లు ఆరోగ్యాన్ని దెబ్బ తీయ‌డ‌మే కాదు మ‌గ‌వారిలో పునరుత్పత్తి వ్యవస్త సామర్థ్యాన్ని సైతం త‌గ్గించేస్తాయి.అందుకే సంతానం కావాల‌ని కోరుకునే పురుషులు ఈ రెండు అల‌వాట్ల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

సాధార‌ణంగా కొంద‌రు పురుషులు ఏ చిన్న నొప్పి వ‌చ్చినా వెంట‌నే పియిన్ కిల్ల‌ర్‌ను వేసేసుకుంటారు.అయితే త‌ర‌చూ పెయిన్ కిల్ల‌ర్స్‌ను తీసుకుంటే.మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు దెబ్బతింటాయట.ఫ‌లితంగా పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

అలాగే రోజూ ఏసీల్లో కూర్చుని ప‌ని చేసే పురుషులు ఖ‌చ్చితంగా వ్యాయామాలు చేయాలి.

కానీ, ఈ విష‌యంలో చాలా మంది అశ్ర‌ద్ధ వ‌హిస్తారు.ఇదీ సంతాన‌లేమికి ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.శారీరక శ్రమ లేకపోవడం వ‌ల్ల సంతానోత్పత్తి స‌మ‌స్య‌లు పెరిగిపోతాయి.

కొంద‌రు పురుషులు విచ్చ‌ల విడిగా జంక్‌ ఫుడ్‌ను లాగించేస్తుంటారు.అయితే ఈ అల‌వాటే కొంప ముంచుతుంది.అధికంగా జంక్ ఫుడ్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వీర్య క‌ణాల నాణ్య‌త దెబ్బ తింటుంది.దాంతో సంతాలేమి ఏర్ప‌డుతుంది.

అందుకే జంక్ ఫుడ్‌ను తిన‌డం త‌గ్గించాలి.లేదా పూర్తిగా మానేయాలి.

ఇక ఇవే కాకుండా అధిక బ‌రువు, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌గ‌వారు బాధ ప‌డుతున్నా సంతానం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు.ఏదేమైన‌ప్ప‌టికీ ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకున్నా సంతానం క‌ల‌గ‌కుంటే వెంట‌నే దంప‌తులు వైద్యుల‌ను సంప్ర‌దించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం.

Its Hard To Have Children If Men Have Those Habits Details Children

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube