చెరువును తలపిస్తున్న గురుకులం

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల తరగతి గదులలో భారీగా చేరిన వర్షం నీరు చేరడంతో మూడు రోజులుగా విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు.సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆత్మకూర్(ఎస్) క్రాస్ రోడ్డుపై ఆదివారం రాస్తారాకో చేశారు.

 Gurukulam Overlooking The Pond-TeluguStop.com

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల గదుల నిండా నీరు చేరి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మోకాళ్ళోతు నీటిలో విద్యార్థులు చదువు కొనసాగించడం కష్టంగా మారిందన్నారు.

మూడు రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య పేరుతో తెలంగాణా ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.

సుమారు 2గంటల పాటు తల్లితండ్రులు రోడ్డుపై బైఠాయించడంతో ఏపూర్,చివ్వెంల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి.అనంతరం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు 4రోజుల్లో వర్షం నీటిని తరగతి గదుల నుండి తొలగించి పరిష్కరిస్తామని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మూడు రోజుల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆత్మకూర్(ఎస్) మండలంలో 19సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరింది.దీనితో క్లాస్ రూమ్స్, హాస్టల్ రూముల్లో 2ఫీట్లకు పైగా వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు మూడు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మంచాల పైనే విద్యార్థులు కూర్చొని భోజనాలు చేయాల్సిన దుష్టితి నెలకొందని విద్యార్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది విద్యార్థుల పుస్తకాలు బట్టలు తడవడంతో ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేసినప్పట్టికి ఎలాంటి ప్రయోజనం లేదని స్టూడెంట్స్ వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube