ఏందిదీ.. వాటర్‌ ట్యాంకర్‌పై ఊరేగుతూ నవ దంపతులు ఆ పని.. హనీమూన్ లేదంటూ!

పెళ్లయిన తర్వాత నవ దంపతులకు అతి ముఖ్యమైన ఘట్టంగా ఊరేగింపు నిలుస్తుంది.పెళ్లి చేసుకొని ఊరందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ చేసుకునే ఉత్సవంగా దీన్ని భావిస్తారు.

 Maharashtra Couple Procession On Water Tank No Water No Honeymoon Details, Water-TeluguStop.com

దీని అసలు అర్థం ఊరందరికీ పెళ్లి చేసుకున్నామని ఎరుక చేయడం లేదా తెలియజేయడం.అయితే నవదంపతులు ఎక్కువగా కార్లలో లేదా గుర్రపు బండిలో ఊరేగింపు చేపడతారు.

కానీ తాజాగా పెళ్లి చేసుకున్న ఒక జంట మాత్రం ఎవరు ఊహించినటువంటి వాహనంపై ఊరేగి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు.అయితే దీని వెనక ఒక మంచి కారణం ఉందండోయ్! అందుకే ఈ ఆలుమగలుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.మంగళవారం నాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నగరంలో నివసిస్తున్న విశాల్ కొలేకర్‌కు అపర్ణతో ఒక పెళ్లి జరిగింది.ఆ తరువాత వీరి ఊరేగింపు వేడుక జరిగింది.ఈ ఊరేగింపులో వారు ఒక వాటర్ ట్యాంకర్‌పై ఊరంతా తిరుగుతూ ఆశ్చర్యపరిచారు.

అయితే వీరు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది.అది ఏంటంటే, కొల్హాపూర్‌ ప్రాంతంలో నీటి సరఫరా సరిగా జరగడం లేదు.

ఇక్కడ వారం రోజులకు కేవలం ఒక్కసారే నీళ్ల పంపులు వస్తున్నాయి.విశాల్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఈ విషయాల గురించి అధికారులకు తెలియజేసినా వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన వరుడు విశాల్ నీటి సమస్యలు తీర్చేంతవరకూ తన భార్యతో కలిసి తాను హనీమూన్‌కు వెళ్లనని ప్రతిన పూనాడు.

నగరంలో నీటి సమస్యల గురించి అందరికీ తెలిసేలా విశాల్ తన వధువును వాటర్ ట్యాంకర్‌పై ఊరేగించాడు.

ఈ ఊరేగింపు ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ సమస్య గురించి దేశవ్యాప్తంగా తెలుస్తోంది.ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేనంత నిద్రమత్తులో ఉన్న స్థానిక ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసిన ఈ నవ దంపతులను అందరూ ప్రశంసిస్తున్నారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం.“స్థానిక పాలకులు అసలు ఈ సమస్యను తీర్చకపోతే మీరు హనీమూన్‌కే వెళ్ళారా?” అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ప్రజల గురించి ఆలోచించి ఈ నవ దంపతులు తమ ఊరేగింపు ఇలా చేసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.వధువు కుటుంబం వరుడికి నీటి సమస్యలు ఉండకూడదని ఏకంగా ఒక వాటర్ ట్యాంకర్ యే కొనిచ్చిందా అని ఇంకొందరు ఈ వీడియోని చూసి కామెంట్ చేస్తున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube