మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క కమర్షియల్ చిత్రంలోను తప్పకుండా ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Jathiratnalu Heroine Faria Abdullah To Do Special Song In Akhil Agent Details, A-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా స్టార్ హీరోయిన్స్ సైతం ఏమాత్రం వెనకడుగు వేయకుండా సై అంటున్నారు.ఇప్పటికే సమంత, తమన్నా, పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేశారు.

ఇకపోతే జాతి రత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి ఫరియా అబ్దుల్లా.

జాతి రత్నాలు సినిమాలో చిట్టిగా అందరిని సందడి చేస్తున్న ఈమె ఆ తర్వాత నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

ఇకపోతే తాజాగా ఈమె మరొక స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.బంగార్రాజు సినిమా ద్వారా నాగచైతన్య నాగార్జునతో కలిసి చిందులు వేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాలో అఖిల్ తో మాస్ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.

Telugu Akhil, Akhil Akkineni, Faria Abdulla, Faria, Sakshi Vaidya, Surender Redd

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఏజెంట్.ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండాలని మేకర్స్ ప్లాన్ చేశారట.అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చేయడం కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించగా చివరికి జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ ఏజెంట్ విషయంలో కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube