సూర్యాపేట జిల్లా:పిల్లల దత్తతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంరక్షగాణకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( District Collector S.
Venkatrav ) అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా దత్తత తల్లిదండ్రులకు దశ స్వీకరణ పత్రాలను అందచేశారు.
అనంతరం ఆయన మాట్లడుతూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి( Central Adoption Resource Authority ),మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా బాలాల పరిరక్షణ విభాగం దత్తత ప్రక్రియ ద్వారా ఒక కుటుంబానికి తండ్రి లేని బాబుకి తండ్రిగా స్టెప్ పేరెంట్ దత్తతగా ఇవ్వటం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమంగా ఈ స్టెప్ పేరెంట్ ద్వారా దత్తత ప్రక్రియ సూర్యాపేట జిల్లాలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా చేశమని తెలిపారు.
సూర్యాపేటకు చెందిన దత్తత తండ్రికి సొంత తల్లి బాబుకి దత్తల తండ్రిగా పూర్తి అధికారాలు సంక్రమించే విధంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి (CARA) నిబంధనల ద్వారా దత్తత ఆమోద పొందిన పత్రాన్ని కలెక్టర్ అందచేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.
మోహన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ,జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్,మీరా అలాగే దత్తత తల్లిదండ్రులు పాల్గొన్నారు.