సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం తక్షణమే ఐకెపి కేంద్రాలను ప్రారంభించి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చూడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ రెడ్డి అన్నారు.ఇప్పటికే వివిధ గ్రామాలలో రైతులు వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఐకెపి సెంటర్లు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపాదికన ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని
డిమాండ్ చేశారు.లేనియెడల రైతులు దళారులకు మద్దతు ధర కాకుండా తక్కువ రేటుకు ధాన్యం ఆమ్ముకోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అందుకే వెంటనే ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంట వేసి బస్తాలను లిఫ్ట్ చేసి బిల్లులు వెంటనే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని,గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు.ఇటీవల అకాల వర్షాల మూలంగా జిల్లాలో అనేక గ్రామాలలో వేలాది ఎకరాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.వరి పంటకు ప్రభుత్వం ఎకరాకు 20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని,వరి పంటకు మద్దతు ధర కల్పించి రైతాంగాన్నికి అండగా ఉండాలన్నారు.ఆయన వెంట నియోజకవర్గ అధ్యక్షులు ఉపేందర్ తదితరులు ఉన్నారు.