సూర్యాపేట జిల్లా:అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలిచిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ పట్టణం కోదాడ మండలం, అనంతగిరి,చిలుకూరు మండలాలకు చెందిన 217 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన రూ.70,60,000 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భాంధవునిగ అదుకుంటుందన్నారు.
మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని, వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుందని,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగ పర్చుకొవాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు.
సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని తెలిపారు.
ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తోందని,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.ఆయా మండలాల ఎంపీపీలు,మండల పార్టీ అధ్యక్షులు,టౌన్ పార్ట్ అధ్యక్షులు,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,పట్టణ కౌన్సిలర్లు,బీఆర్ఎస్ నాయకులు,సొసైటీ చైర్మన్,ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.