ప్రారంభమైన పోలీసు వార్షిక క్రీడలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీసుల మానసిక వికాసానికి నిర్వహిస్తున్న క్రీడలను జిల్లా జడ్జ్ వసంత్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని,నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు.

 Police Annual Sports Started-TeluguStop.com

జిల్లా ఏర్పడినాక ఇలాంటి క్రీడల టోర్నీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని,ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీసు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమని,పోలీసు ఉద్యోగం అనేది వత్తిడి,శ్రమతో కూడినదని,వత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా దోహదం చేస్తాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని,క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, గెలుపు ఓటములు సహజమని,యుద్ధం చేయడం,పోరాడడం ముఖ్యమని సూచిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది కోరిక మేరకు ఈ టోర్నీ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నామని,ప్రతి ఒక్కరూ గెలుపుకోసం ఆడాలని,క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని,జిల్లా పేరును నిలపడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్,డిఎస్పీలు రఘు,మోహన్ కుమార్,రవి, సీఐలు విఠల్ రెడ్డి,ఆంజనేయులు,రాజేష్,శ్రీనివాస్, ఆంజనేయులు,నాగర్జున,పిఎన్ డి ప్రసాద్, రామలింగారెడ్డి,నర్సింహారావు,ఆర్ఐలు నర్సింహారావు, గోవిందరావు,శ్రీనివాస్,ఎస్ఐలు,క్రీడాకారులు,పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్ తదితరులు హాజరై క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పోలీసు సంఘం అధ్యక్షులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube