ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండలు ఊపందుకోగా.మే నెల వచ్చే సరికి తారా స్థాయికి చేరుకున్నాయి.
అసని తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండు, మూడు రోజుల పాటు వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.మళ్లీ ఎండలు మంట పుట్టిస్తున్నాయి.
ఈ సీజన్‌లో సాధారణ వ్యక్తుల కంటే గర్భిణీ స్త్రీలే ఎక్కువ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తుంటారు.మండే ఎండలు, ఉక్కపోత కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను గనుక గర్భిణీలు తీసుకుంటే ఆరోగ్యాన్ని, చర్మాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం వేసవిలో గర్భిణీలు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి.
చాలా మంది వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్, కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తెగ తాగేస్తుంటారు.కానీ, గర్భిణీలు మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టిన పానియాలే కాదు ఇతర ఆహారాల జోలికి కూడా వెళ్లకపోవడం ఎంతో మంచిది.
ఫ్రిడ్జ్ వాటర్ బదులు మంటి కుండ నీటిని ఎంచుకోవాలి.ఫ్రూట్ జ్యూస్‌లు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా డైరెక్ట్‌గానే తీసుకోవాలి.
అలాగే గర్భణీలు చల్లదనం కోసం ఎప్పుడూ ఏసీ గదుల్లోనే ఉంటే డీహైడ్రేషన్, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.కాబట్టి, శరీరానికి బయట గాలి తగిలేలా కూడా చూసుకోవాలి.
కంటి నిండా నిద్ర పోవాలి.వేసవిలో కొందరు గర్భిణీలకు తరచూ వాంతులు అవుతుంటాయి.
అలాంటప్పుడు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి.కారం, మసాలా, వేపుళ్లు, స్వీట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, తాజా పండ్లు తీసుకోవాలి.ఫుడ్‌ను ఒకేసారి కాకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి.

ఉదయం, సాయంత్రం తప్పకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేసి.మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.గర్భిణీలు ఈ సీజన్‌లో ప్రయాణాలు చేయకపోవడం చాలా ఉత్తమం.ఒకవేళ జర్నీ చేయాల్సిన పరిస్థితులు వస్తే సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలి.వదలైన కాటన్ వస్త్రాలను ధరించాలి.నెత్తిపై క్యాప్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి.
ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే వేసవిలో ఆరోగ్యం, చర్మం రెండూ సురక్షితంగా ఉంటాయి.







