పాలు.ఒక సంపూర్ణ పోషకాహారం.
వయసుతో సంబంధం లేకుండా అందరికీ మేలు చేసే పాలలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇలా బోలెడన్ని పోషక విలువలు సరైన మొత్తంలో నిండి ఉంటాయి.అందుకే రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే పాలను కొందరు ఉదయం పూట తాగితే.మరి కొందరు మాత్రం రాత్రి నిద్రించే ముందు సేవిస్తుంటారు.
మరి ఇంతకీ రాత్రి నిద్రించే ముందు పాలు తాగొచ్చా.? తాగకూడదా.? అసలు రాత్రి వేళ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.? కాదా.? ఇటువంటి ప్రశ్నలు చాలా మందికి మదిలో మెదులు తుంటాయి.
అయితే నిజం ఏంటంటే.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు సేవిస్తే నష్టాలు కాదు.మంచి లాభాలనే పొందొచ్చు.
మరి ఎందుకు లేటు.ఆ లాభాలు ఏంటో ఓ లుక్కేసేయండి.
ఇటీవల కాలంలో ఎందరో మలబద్ధకం సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నారు.అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చటి పాలను సేవిస్తే.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.దాంతో మలబద్ధకం పోవడమే కాదు.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు సైతం దరి చేరకుండా ఉంటాయి.
అలాగే రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చటి పాలను సేవిస్తే త్వరగా మరియు మంచిగా నిద్ర పడుతుంది.నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది.అంతేకాదు, ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాలు తాగితే.
ఉదయం పూట నీరసం, అలసట వంటి సమస్యలు ఉండవు.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంతేకాదు. ఒత్తిడి, డిప్రెషన్, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.శరీరంలోని హార్మోన్లు చురగ్గా పని చేస్తాయి.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
మరియు చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.