బిఎల్ఓల నిర్లక్ష్యం ఓటు కోసం కొత్త ఓటర్ల తంటాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: క్షేత్రస్థాయిలో బిఎల్ఓల నిర్లక్ష్యం కారణంగా కొత్త ఓటర్లు నానా తంటాలు పడుతున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల కమీషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ వంశీరెడ్డి అన్నారు.ఆలేరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆలేరులో పలువురు కొత్త ఓటర్లకు ఓటర్ స్లిప్ ఇవ్వలేదని,ఆన్ లైన్ సెంటర్ కి వెళ్లితే ఓకే ఇంటి నెంబర్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక దగ్గర, కొత్తగా వచ్చిన వారి ఓట్లు మరో దగ్గర ఉండడం,

 Neglect Of Blos New Voters Facing Problems, Blos, New Voters , Patel Vamshi R-TeluguStop.com

ఆలేరు ఓటు కొలనుపాకలో ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.

బూత్ లెవర్ ఆఫీసర్ (బిఎల్ఓ) నిర్లక్ష్యంతో ఈ విధంగా తారుమారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటింటికి ఓటర్ల స్లిప్స్ సరైన సమయానికి రాకపోవడంతో అసలు ఓటు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందన్నారు.

నూతన ఓటు నమోదు చేసుకుని కొన్ని నెలలు గడిచినా కొందరికి ఇప్పటికీ ఓటు రాలేదన్నారు.సరైన సమయంలో అన్ లైన్ దరఖాస్తు చేసుకున్నా నేటి అసెంబ్లీ ఎన్నికలకు ఓటు రాకపోవడం సిబ్బంది నిర్లక్ష్యమేనని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube