యాదాద్రి భువనగిరి జిల్లా: అన్నదమ్ముల్లా కలిసుండే గొల్లకురుమల మధ్య ఆలేరు ఎమ్మేల్యే అభ్యర్ధి గొంగొడి సునీత రెడ్డి చిచ్చు పెడుతున్నారని గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామిరెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శనివారం సబ్బండ వర్గాల యాదవుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహించి,దానికి సబ్బండ వర్గాల వారిని ఆహ్వానించి,యాదవుల ఆత్మీయ సమ్మేళనంగా ప్రజల్లో భ్రమలు కలిగిస్తున్నారని అన్నారు.
కలిసున్న గొల్లకురుమలను యాదవులుగా,కురుమలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,గొల్లకురుమలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు.వారికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని,కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్ని వర్గాల ప్రజల మద్దతుతో అఖండ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలుకొండ యాదగిరి,పిఎసిఎస్ చైర్మన్ లింగాల భిక్షం తదితరులు పాల్గొన్నారు.