రెండు లారీలు ఢీ-ఇద్దరు డ్రైవర్లు మృతి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

 Two Trucks Collide — Two Drivers Killed-TeluguStop.com

సూర్యాపేట- జనగామ 365(బి) జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.సూర్యాపేట నుండి తిరుమలగిరి వైపు ధాన్యం లోడుతో వెళుతున్న టీఎస్03 యూబి 3485 నెంబర్ గల లారీ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి బయల్దేరిన ఏపీ16 టిఈ 5839 బొగ్గు లారీ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు 4 గంటలు శ్రమించి మృతదేహాలని బయటికి తీశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube