సంతోషంలో పార్టీ చేసుకుంటుండగా ఊహించని ఘటన.. విమానం కుప్పకూలడంతో విషాదం..

మాతృత్యం అంటే మహిళలందరికీ ఆనందమే.తల్లి కావాలని ప్రతి భార్యకు ఉంటుంది.

 Unexpected Incident While Partying Happily Tragedy Of Plane Crash, Unexpected In-TeluguStop.com

అలాగే తండ్రిని కావాలని భర్తకు కూడా ఉంటుంది.భార్య గర్భవతి అయితే కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటుంది.

త్వరలో తమ కుటుంబంలో పండంటి బిడ్డ వస్తుందనే ఆనందంలో ఉంటారు.అయితే ఒక మహిళ గర్భవతి అవ్వగా.

త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.ఈ ఆనందాన్ని కుటుంబసభ్యులతో పంచుకునేందుకు ఒక పార్టీ ఏర్పాటు చేసింది.

కానీ ఈ పార్టీలో విషాదం చోటుచేసుకుంది.

బిడ్డ గురించి చెప్పేందుకు ఓ భార్యాభర్తలు బంధుమిత్రులకు పార్టీ ఏర్పాటు చేశారు.ఈ పార్టీలో ఒక స్టంట్ విమానాన్ని ఏర్పాటు చేయగా.అది ప్రమాదవశాస్తూ కుప్పకూలడంతో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషాదకర సంఘటన మెక్సికోలో( Mexico ) చోటుచేసుకుంది.సెప్టెంబర్ 2న ఈ ఘటన చోటుచేసుకోగా.

ఇప్పుడు ఆలస్యంగా బయటకు వచ్చింది.సాన్ పెడ్రో( San Pedro ) అనే ప్రాంతాననికి చెందిన మహిళ గర్బం దాల్చగా.

త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది.ఈ ఆనందంలో తన బంధువులు, మిత్రులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించింది.

అత్యంత గ్రాండ్ గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

జెండర్ రివీల్ పేరిట ఈ పార్టీ ఏర్పాటు చేశారు.పార్టీకి భారీ సంఖ్యలో బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.ఈ పార్టీలో ఓ స్టంట్ విమానాన్ని ఏర్పాటు చేయగా.

కాబోయే తల్లిదండ్రుల దగ్గరకు విమానం వచ్చి పింక్ కరన్ ను వెదజల్లింది.ఆ తర్వాత గాల్లో ఎగురుతూ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మరణించాడు.దీంతో ఆనందంలో జరుపుకోవాల్సిన పార్టీ ఈ ఘటనతో విషాదాంతంగా మారింది.

దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియెో చూసినవారు షాక్ అవుతున్నారు.

నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుుతున్నారు.ఇలాంటి స్టంట్లు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube