సూర్యాపేట జిల్లా:గిరిజన జాతిరత్నం సంత్ సేవాలాల్ మహారాజ్ స్పూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మాలోత్ సైదా నాయక్ అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న గిరిజన కళాశాల బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ 284వ జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడుతూ గిరిజన జాతి అభివృద్ధి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్మావత్ రాజు నాయక్, జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్,హాస్టల్ వార్డెన్ వెంకటరెడ్డి,గిరిజన ఆశ్రమ వసతి గృహ సంక్షేమ అధికారి వంగపల్లి పద్మ, పంతుల్య నాయక్, యువజన నాయకులు బాలు నాయక్,కోటేష్ నాయక్,మట్టపల్లి నాయక్,నాగు నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.