గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో మాజీమంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మీడియా స‌మావేశం

అమ‌రావ‌తి ఆంధ‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా గుర్తించినందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు ప‌్ర‌త్తిపాటి ఈ విష‌యంపై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి అమ‌రావ‌తి ఏపీ రాజ‌ధానిగా కేంద్రం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వాలి ప‌్ర‌త్తిపాటి సెక్ర‌టేరియ‌ట్‌, అసెంబ్లీ, గృహ‌స‌ముదాయాలు, హైకోర్టు త‌దిత‌ర మిగిలిపోయిన ప‌నుల‌న్నింటికీ కేంద్రం నిధులు విడుద‌ల చేయాలి.ఆఫ్ఘ‌నిస్తాన్‌కు రూ.20వేల కోట్ల సాయం కేంద్రం అందించింది… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎందుకు ఆర్థిక స‌హాయం కేంద్రం స‌హాయం చేయ‌దు.అమ‌రావ‌తి రాజ‌ధాని పూర్త‌య్యేవ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయం చేయాలి ,వివేకానంద‌రెడ్డి హ‌త్య దోషులు ఎవ‌ర‌నేది సీబీఐకి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్ధ‌మైంది, బాబాయ్ హ‌త్య కేసు గురించి ముఖ్య‌మంత్రి ఎందుకు మాట్లాడ‌టం లేదు.

 Former Minister Pratipati Pulla Rao Held A Media Conference In Chilakaluripet, G-TeluguStop.com

ఏమి దాచ‌డానికి అవ‌కాశం ఉంద‌ని సీఎం ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీనికి ముఖ్య‌మంత్రి స‌మాధానం చెప్పాలి వివేకానంద‌రెడ్డి కేసులో దోషులెవ‌రనేది తేలిన‌ త‌ర్వాత వైకాపాలో అంత‌ర్గ‌త పోరు మొద‌ల‌వుతుంది.

అధికార‌పార్టీ ముక్క‌లై అధికారం కోల్పే ద‌శ‌కు చేరుతుంది.

ఇప్ప‌టికే వైకాపాలో అంత‌ర్గ‌త పోరు ప్రారంభ‌మైంది.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో నివురుగ‌ప్పిన నిప్పులా వైకాపా ప‌రిస్థితి ఉంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య‌, ఎమ్మెల్యేకు, కింద కేడ‌ర్‌కు మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది.మెగా డిఎస్సీ, జాబ్‌క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్పుడు ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేదు గుంటూరులో స‌చివాల‌య సిబ్బందిని మ‌రుగుదొడ్ల రుసుము క‌లెక్ష‌న్‌కు పెట్ట‌డం దుర్మార్గం ఉపాధ్యాయుల‌ను మ‌ద్యం దుకాణాల వ‌ద్ద‌, రెవెన్యూ వారిని సినిమాహాళ్ల వ‌ద్ద పెట్ట‌డం దారుణం రైతుల వ‌ద్ద కొన్న ధాన్యానికి ఇంత‌వ‌ర‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేదు రోజుకు 50వేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని ల‌క్ష్యం ఉన్న‌ప్ప‌టికీ 10వేల ట‌న్నులు మాత్ర‌మే కొనుగోలు చేశారు.రూ.2వేల నుంచి రూ.3వేల‌కోట్ల బ‌కాయిలు రైతులకు ఇవ్వ‌లేదు ప్ర‌భుత్వాన్ని న‌మ్మి ధాన్యం ఇవ్వ‌లేక‌ రైతులు బ‌య‌ట రూ.1,100లు రూ.1,200ల‌కు అమ్ముకునే దుస్థితిలో రైతులు ఉన్నారు.అన్నివ‌ర్గాల‌ను జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మోసం చేశారు.

ఒక‌సారి చూద్ధాం అని ఓటు జ‌గ‌న్‌కు వేసిన ప్ర‌జ‌లు ప‌శ్చాతాప్ప‌డుతున్నారు.

అధికారాన్ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మ సంపాద‌న‌కు ఉప‌యోగిస్తున్నారు గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌లో గ్రానైట్ ద్వారా వ‌చ్చే ప్ర‌భుత్వ వేల‌కోట్ల రూపాయ‌ల ఆదాయానికి ప్ర‌జాప్ర‌తినిధులు గండికొడుతున్నారు .ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో రోజుకు 500ల లారీల గ్రానైట్ లారీలు అక్ర‌మంగా త‌ర‌లివెళుతున్నాయి .గ్రానైట్ క్వారీల త‌వ్వ‌కాల‌లో వ‌చ్చే మ‌ట్టి త‌ర‌లించ‌డంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోంది.విజిలెన్స్ నిద్రావ‌స్థ‌లో ఉంది ,ప్ర‌భుత్వ వ‌న‌రుల‌ను ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దోచిపెడుతున్నారా ముఖ్య‌మంత్రి 1976 యాక్ట్ ప్ర‌కారం 1972లో క‌ట్టుకున్న ఇళ్ల‌కు 1.5శాతం అద‌నంగా ల్యాండ్ సీలింగ్ పేరుతో అద‌నంగా భారం వేస్తోంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దొడ్దిదారిన ప్ర‌భుత్వ వ‌న‌రులు దోచిపెడుతున్న జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.పేద‌ల‌పై మాత్రం అన్ని విధాలుగా భారం వేస్తున్నారు.చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో నిర్మించిన 3ల‌క్ష‌ల టిడ్కో ఇళ్ల‌ను ఎందుకు ల‌బ్ది దారుల‌కు ఇవ్వ‌లేదు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో నిర్మించిన 3ల‌క్ష‌ల టిడ్కో ఇళ్ల‌ను ఎందుకు ల‌బ్ది దారుల‌కు ఇవ్వ‌లేదు బ్యాంకుల వ‌డ్డీలు, అద్దెలు క‌ట్టుకోలేక లబ్దిదారులు ఇబ్బంది ప‌డుతున్నారు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి 3ల‌క్ష‌ల కుటుంబాల ఉసురు త‌ప్ప‌క త‌గులుతుంది ప్ర‌తి మీటింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్గీ వ‌ర్గాల వారు త‌మ‌వార‌ని గొప్ప‌లు చెప్ప‌కునే ముఖ్య‌మంత్రి.

ప్ర‌తీకారం తీర్చ‌కునేందుకే గొప్ప‌లు చెబుతున్నారా.

రాష్ట్రంలో 30ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామ‌ని చెప్పి రూ.7వేల కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డింది 30లక్ష‌ల ఇళ్ల స్థ‌లాల‌తో 10వేల మంది మాత్ర‌మే ఇళ్లు క‌ట్టుకున్నారు.ఇంటి నిర్మాణ ఖ‌ర్చు రెట్టింపు అయ్యింది.

బ్యాంకులు అప్పులు ఇవ్వ‌వు.ల‌బ్దిదారులు ముందుకు రారు.

ప్ర‌భుత్వం మాత్రం ఇళ్లు క‌డుతున్నామ‌ని గొప్ప‌లు చెబుతోంది జ‌గ‌న‌న్న కాల‌నీలు అని చెప్పి క‌నీస మౌలిక వ‌సతుల క‌ల్ప‌న ఏవీ చేయ‌లేదు ఇంక ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ మోసం చేయ‌లేరు… ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌భుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు .స‌మావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి షేక్ క‌రిముల్లా, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నెల్లూరి స‌దాశివ‌రావు, చిల‌క‌లూరిపేట మండ‌ల అధ్య‌క్షులు జ‌వ్వాజి మ‌ద‌న్‌, కౌన్సిల‌ర్ గంగా శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube