పెళ్లైన ప్రతి మహిళ జీవితంలోనూ ప్రెగ్నెన్సీ సమయం అనేది ఎంతో మధురంగా ఉంటుంది.ఆ సమయంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు పొందుతారు.
అయితే ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే స్త్రీకు మరో జన్మ.అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలీ అంటే గర్భం దాల్చినప్పటి నుంచీ తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.మరి ఆ పోషకాలు ఏంటీ.? అవి ఎందులో దొరుకుతాయి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీ రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే, శిశువు ఎముకలు మరియు దంతాల కి కాల్షియం ఎంతో అవసరం.అందువల్ల.
పాలు, పెరుగు, పనీర్, చేపలు, గుడ్డు వంటివి తీసుకుంటే కాల్షియం అందుతుంది.
![Telugu Calcium, Folic Acid, Tips, Iron, Latest, Pregnancy, Pregnant, Vitamin-Tel Telugu Calcium, Folic Acid, Tips, Iron, Latest, Pregnancy, Pregnant, Vitamin-Tel](https://telugustop.com/wp-content/uploads/2021/06/good-health-health-folic-acid-pregnant-women-calcium-vitamin-d.jpg)
అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు రక్త హీనతతో బాధ పడుతున్నారు.ఈ రక్త హీనత ప్రభావం శిశువు ఆరోగ్యంపై పడుతుంది.అందుకే ఐరన్ పుష్కలంగా ఉండే నట్స్, ఆకు కూరలు, బీన్స్, పప్పు ధాన్యాలు, టమాటా, ఖర్జూరాలు వంటివి తీసుకుంటే రక్త హీనత పరార్ అవుతుంది.
![Telugu Calcium, Folic Acid, Tips, Iron, Latest, Pregnancy, Pregnant, Vitamin-Tel Telugu Calcium, Folic Acid, Tips, Iron, Latest, Pregnancy, Pregnant, Vitamin-Tel](https://telugustop.com/wp-content/uploads/2021/06/good-health-health-folic-acid-pregnant-women-calcium-vitamin-d-iron.jpg)
తల్లీ, బిడ్డ హెల్తీగా మరియు యాక్టివ్‌గా ఉండాలీ అంటే ప్రోటీన్ ఎంతో అవసరం.కాబట్టి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, చేపలు, డైరీ ప్రోడెక్ట్స్, ఓట్స్, పాలకూర, తాజా పండ్లు వంటివి తీసుకోవాలి.
ప్రెగ్నీన్సీ టైమ్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పోషకాల్లో విటమిన్ డి ఒకటి.విటమిన్ డి తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావు.తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో మేలు చేస్తుంది.అందువల్ల, ప్రతి రోజు ఉదయాన్నే కాసేపు సూర్యుడి ఎదుట ఉండటంతో పాటుగా.
ఆరెంజ్ జ్యూస్, పుట్టగొడుగులు, ఛీజ్ వంటివి తీసుకుంటే విటమిన్ డి అందుతుంది.
ఇక గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం.
ఈ ఫోలిక్ యాసిడ్ శిశువు బ్రెయిన్ మరియు బరువు పెరగడానికి సహాయపడుతుంది.అంతేకాదు, ప్రిమెచ్యూర్ బర్త్ రిస్క్‌ను తగ్గిస్తుంది.
.