రీల్స్ పిచ్చి.. ట్రైన్ పై కరెంట్ వైర్లు తాకడంతో సగం కాలిన శరీరం..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము.ఇందులో ఎక్కువగా పని క్రియేట్ చేసే వీడియోలు అలాగే కొన్ని యాక్సిడెంట్ సంబంధించిన వీడియోలు, ఇంకా మరికొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్( Viral Videos ) అవ్వడం చూస్తూనే ఉంటాము.

 Boy Attempts Risky Stunt On Moving Train Roof Goes Wrong Viral Video Details, Vi-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో కొందరు రీల్స్ చేసేందుకు ఇష్టానుసారం ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాము.చాలామంది వారి ప్రాణాలకు తెగించి మరీ వీడియోలు చేస్తున్నారు.

ఇలా చేస్తున్న సమయంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.మరికొందరైతే అంగవైకల్యంగా మారిన వారు ఎందరో.

తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

రీల్స్ పిచ్చిలో పడిపోయివుడు తోటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.యువకుడు రీల్స్( Reels ) చేసేందుకు రైలును ఎంచుకున్నాడు.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు.రైలు( Train ) వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అతడు రీల్స్ చేయడం కోసం రైలు పైకి ఎక్కి ప్రమాదకరంగా విన్యాసాలు చేయబోయాడు.

అలా రైలు పైకి ఎక్కగానే అతడు చెయ్యి పైకి పెట్టడంతో రైలు పైన ఉన్న కరెంటు వైర్లు( Electric Wires ) తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో అతడు వెంటనే స్పృహ కోల్పోయి రైలు మీదనే పడిపోయాడు.

ఈ సంఘటనలో అతడికి శరీరం సగం భాగం కాలిపోయింది.

అయితే, అతడు ప్రాణాలతో అదృష్టవశాత్తు బయటపడ్డాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అతడు ఈ పని చేస్తున్న సమయంలో అతని స్నేహితుడు రైలులో ఉండి వీడియో రికార్డ్ చేశాడు.

ఘటన జరిగిన తర్వాత అతనిలో హాస్పిటల్ లో చేర్పించిన సమయంలోనే ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇటువంటి వారిపై కఠిన చర్య తీసుకోవాలని.

, మరొకరు ఇలాంటి వాటిని చేయకుండా రైల్వే శాఖ తగు చర్యలు చేపట్టాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube