నేటి కాలంలో లిప్‌స్టిక్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా అమ్మాయిలు లిప్‌స్టిక్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.
అంతలా లిప్ స్టిక్స్‌ను వాడేస్తున్నారు.అందాన్ని రెట్టింపు చేయడంలో లిప్ స్టిక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అందుకే ముఖానికి ఎన్ని క్రీములు, పౌడర్లు పూసినా పెదాలకు లిప్ స్టిక్ వేయకుంటే మాత్రం ఏదో వెలితిగానే ఉంటుంది.ఇక లిప్ స్టిక్స్ వాడే వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి.
కొందరు తెలిసో తెలియకనో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు.
కానీ, ఇలా చేస్తే.కొద్ది సేపటికే లిప్స్ డ్రైగా మారిపోతాయి.
అందువల్ల, లిప్ స్టిక్ వేసుకునే ముందుకు ఖచ్చితంగా లిప్స్‌కు వేజలైన్ అప్లై చేయాలి.

అలాగే పెదవులు మెరవాలి అని అనుకునే వారు కేవలం లిప్ స్టిక్ వేస్తే సరిపోదు.లిప్‌స్టిక్ వేసుకుని అపై లిప్‌గ్లాస్ వేసుకుంటే షైనీగా మెరుస్తాయి.ఇక లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ లైనర్ వేసుకోవాలి.
దీని వల్ల లిప్ స్టిక్ మూతి చుట్టూ అంటూకోకుండా ఉంటుంది.

లిప్ స్టిక్ ఎక్కువ సమయం పాటు ఉండాలి అని అనుకునే వారు ముందుగా పెదాలకు కొబ్బరి నూనె అప్లై చేసి పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకోవాలి.ఇలా చేస్తే పెదాలు తేమగా ఉంటాయి.
దాంతో లిప్ స్టిక్ ఎక్కువ సమయం పాటు ఉంటుంది.
ఇక లిప్ స్టిక్స్ ఎక్కువగా వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి.
అందువల్ల, పెదాలను పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే నల్లటి లిప్స్ ఎర్రగా మారాయి.
అలాగే నిద్రించే ముందు ఖచ్చితంగా లిప్ స్టిక్‌ను తొలిగించి పడుకోవాలి.లేదంటే లిప్ స్టిక్స్‌లో ఉండే కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి.