దీని వల్ల లిప్ స్టిక్ మూతి చుట్టూ అంటూకోకుండా ఉంటుంది. """/"/
లిప్ స్టిక్ ఎక్కువ సమయం పాటు ఉండాలి అని అనుకునే వారు ముందుగా పెదాలకు కొబ్బరి నూనె అప్లై చేసి పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకోవాలి.ఇలా చేస్తే పెదాలు తేమగా ఉంటాయి.
దాంతో లిప్ స్టిక్ ఎక్కువ సమయం పాటు ఉంటుంది.ఇక లిప్ స్టిక్స్ ఎక్కువగా వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి.
అందువల్ల, పెదాలను పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే నల్లటి లిప్స్ ఎర్రగా మారాయి.
అలాగే నిద్రించే ముందు ఖచ్చితంగా లిప్ స్టిక్‌ను తొలిగించి పడుకోవాలి.లేదంటే లిప్ స్టిక్స్‌లో ఉండే కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి.