తెలంగాణలో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కు తిరుగులేకుండా అన్ని వర్గాల మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు.దీనిలో భాగంగానే అనేక అంశాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకపక్క కాంగ్రెస్ , బీఆర్ఎస్ లను ధీటుగా ఎదుర్కొంటూనే పార్టీ పరంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.తమకు కలిసి వచ్చే అన్ని అంశాల పైన బీఆర్ఎస్ పోకేస్ పెట్టింది.
దీనిలో భాగంగానే బీసీ రిజర్వేషన్లు అమలుపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ నేతల బృందం నేడు తమిళనాడుకు బయలుదేరి వెళ్లనుంది.మండల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ,మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud )నేతృత్వంలో 25 మంది సభ్యుల టీం తమిళనాడుకు నేడు వెళ్తున్నారు.
ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బిసి కమిషన్ చైర్మన్ సెక్రటరీలతో బీఆర్ఎస్ బృందం భేటీ కానుంది .ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించుకున్నారు.
రేపు శుక్రవారం డిఎంకె కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ బృందం చర్చించనుంది. తమిళనాడు( Tamil Nadu )లో విద్య , ఉద్యోగాలు , స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, డిఎంకె పార్టీ సంస్థాగత నిర్మాణం, బీసీలకు దక్కుతున్న ప్రాధాన్యం వంటి అన్ని అంశాల పైన బీఆర్ఎస్ బృందం పూర్తిగా అధ్యయనం చేసి, పార్టీకి నివేదిక సమర్పించనున్నారు.తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఒత్తిడి పెంచేందుకు కసరత్తు చేస్తోంది.దీనికి సంబంధించిన అన్ని వివరాలతో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS party ) బీసీల ఓటు బ్యాంకు ను ఆకట్టుకునే విధంగా ఏం చేయాలనే దానిపైన ఈ బృందం అధ్యయనం చేయనుంది.బీసీల్లో పూర్తిస్థాయిలో పట్టు సాధించే విధంగా బీఆర్ఎస్ ముందడుగు వేస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా తమకు కలిసి వచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకునే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.