పరారీలో యూట్యూబర్ హర్ష సాయి.!

హర్ష సాయి( Youtuber Harsha sai ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసారు.నాలుగు టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

 Youtuber Harsha Sai Escape After Case Against Him, From Police, Harsha Sai, Po-TeluguStop.com

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.సదరు మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసారు.

ఈ నేపథ్యంలో సెక్షన్స్ 376, 354, 328 కింద కేసు నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు.ఇప్పటికే బాధితురాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు.

Telugu Harsha Sai, Story, Latest, Youtuberharsha-Latest News - Telugu

హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు పోలీసులు.అయితే ఈ విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు హర్ష సాయి తరపు న్యాయవాదులు.ఈ ఉదంతం మొత్తం కేవలం డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు అని న్యాయవాది తెలిపారు.ఇక ఈ కేసులో మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగిక వేధించారని ఫిర్యాదు అందింది.

Telugu Harsha Sai, Story, Latest, Youtuberharsha-Latest News - Telugu

ఈ విషయంలో ప్రేమ పేరుతో మోసం చేసి, ఆపై శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో తన వద్ద రూ.2 కోట్ల తీసుకున్నాడని, పెళ్లి చేసుకోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసు పెట్టడంతో ఒక్కసారిగా సంచలం రేపింది.ఇక మెగా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ డిస్కషన్ కోసం విల్లాకు తనని పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి.తాను స్పృహలో లేనప్పుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె వాపోయింది.

ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ హర్ష సాయి కేసు నమోదైనప్పటినుండి పరారీలో ఉన్నాడు.అయితే తాజాగా ఇందుకు సంబంధించి తన ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటో పెట్టి తన నిర్ణయాన్ని తెలిపాడు.

దాంతో ఇప్పుడు పోలీసులు హర్ష సాయి కోసం వేట మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube