పరారీలో యూట్యూబర్ హర్ష సాయి.!
TeluguStop.com
హర్ష సాయి( Youtuber Harsha Sai ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసారు.
నాలుగు టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
సదరు మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసారు.ఈ నేపథ్యంలో సెక్షన్స్ 376, 354, 328 కింద కేసు నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు.
ఇప్పటికే బాధితురాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. """/" /
హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు పోలీసులు.
అయితే ఈ విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు హర్ష సాయి తరపు న్యాయవాదులు.
ఈ ఉదంతం మొత్తం కేవలం డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు అని న్యాయవాది తెలిపారు.
ఇక ఈ కేసులో మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగిక వేధించారని ఫిర్యాదు అందింది.
"""/" /
ఈ విషయంలో ప్రేమ పేరుతో మోసం చేసి, ఆపై శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో తన వద్ద రూ.
2 కోట్ల తీసుకున్నాడని, పెళ్లి చేసుకోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసు పెట్టడంతో ఒక్కసారిగా సంచలం రేపింది.
ఇక మెగా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ డిస్కషన్ కోసం విల్లాకు తనని పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి.
తాను స్పృహలో లేనప్పుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె వాపోయింది.
ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ హర్ష సాయి కేసు నమోదైనప్పటినుండి పరారీలో ఉన్నాడు.అయితే తాజాగా ఇందుకు సంబంధించి తన ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటో పెట్టి తన నిర్ణయాన్ని తెలిపాడు.
దాంతో ఇప్పుడు పోలీసులు హర్ష సాయి కోసం వేట మొదలు పెట్టారు.
బిగ్ బాస్ షో వల్లే నా పేరు నాశనం.. తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు వైరల్!