సూర్యాపేట జిల్లా:ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె,గ్రామీణ భారత్ బంద్ కోసం సూర్యాపేట పట్టణంలో సుధాకర్ పివిసి, సువెన్ ఫార్మా కంపెనీల మేనేజర్లు మూర్తి,సైదులుకు కార్మిక సంఘాల జిల్లా నాయకత్వం అధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసులను అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,ఐఎఫ్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య( ganta nagayya ),ఏఐటీయూసీ బాధ్యులు నిమ్మల ప్రభాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలపై, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,కనీస వేతనాలు రూ.26 వేలు అమలు చేయాలని,ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని,అధిక ధరలను నియంత్రించాలని,మతతత్వ ఫాసిస్టు విధానాలను తిరస్కరించాలని,రైతు,కార్మిక సంఘాలు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత బంద్ కు పిలుపునిచ్చాయన్నారు.దీనిలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు,ప్రజలు,పట్టణంలోని అన్ని కంపెనీల కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు,ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, సిఐటియు జిల్లా నాయకులు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.