సూర్యాపేట జిల్లా:భూ పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తుందని,దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు భూమి ఇవ్వడానికి అవకాశం ఉందని,ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రూ.2,56,958 లక్షల కోట్ల బడ్జెట్ లో మూడు ఎకరాల భూమిని పంపిణీకి ఒక్క పైసా కేటాయించకపోవడం,సెంటు భూమిలేని 3.50 లక్షల దళిత కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చెయ్యడమే అవుతుందన్నారు.ఆర్భాటంగా ప్రకటించిన ఖాళీ పోస్టుల భర్తీ ప్రకటనకు కావాలిసిన నిధులు బడ్జెట్ లో ఒక్క పైసా కేటాయించలేదని,పొడుసాగుదారులకు హక్కుపత్రాలిస్తామని తీసుకున్న అప్లికేషన్ లపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అట్టడుగు వర్గాల ప్రజలను నిలువునా మోసం చెయ్యడమేనని ధ్వజమెత్తారు.
డబల్ బెడ్రోమ్ ఇండ్లకు,ఇంటిస్థలం ఉన్నవాళ్లకు మూడు లక్షల నగదు ఇస్తాం అంటూనే బడ్జెట్లో రూ 12 వేల కోట్లు కేటాయించడం చూస్తే డబల్ బెడ్రోమ్ ఇండ్ల నిర్మాణంను తుంగలో తొక్కినట్లే అన్నారు.ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి మూడు లక్షల నగదు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెల్లరేషన్ కార్డులు కోసం,57 ఏండ్లలోపు ఉన్న వారు,పింఛన్లు కోసం ధరఖాస్తులు మీసేవలో చేసిన వారు లక్షల్లో ఉన్నారని,వారి గురుంచి అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడకపోవడం మోసం చేయడమేనని ఆరోపించారు.
ప్రభుత్వం తక్షణమే అర్హులకు రేషన్ కార్డులు,పింఛన్లు మంజూరు చెయ్యాలని,ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధరణి పోర్టుర్ లో మార్పులు తెచ్చి పేదలు అనుభవంలో ఉన్న పోడు,బంజరు,ఇనాం, అసైన్డ్ మెంట్,చెరువుశిఖం,భూదాన,దేవాదాయ, కాందిశీకుల భూములకు పట్టాలివ్వాలని,రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ జిల్లా స్థాయి విస్తృత సమావేశం సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జెండాను జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు,రైతు సంఘం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,దేవరం వెంకట్ రెడ్డి,సిఐటీయు జిల్లా నాయకులు మిట్ట గడుపుల ముత్యాలు,వెంకట్ నారాయణ,ఐద్వా జిల్లా నాయకురాలు కుక్కడపు నళిని,గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొదమగుండ్ల నగేష్,పులుసు సత్యo,సోమపంగు జానయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,పోషణబోయిన హుస్సేన్, నల్లమేకల అంజయ్య,రాపోలు సూర్యనారాయణ, సిరికొండ శ్రీను,పఠాన్ మైబూబ్ అలీ,సానబోయిన ఉపేందర్,మిట్టపల్లి లక్ష్మి,పడమటింటి నగేష్, ఉయ్యాల పారిజాత,ఒగ్గు నిర్మల,సీతాదేవి,బోయిల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.