అఖండమైన అందగత్తె అయినా కూడా ఎందుకు ఆఫర్‌ లు లేవు?

మెగా హీరో వరుణ్ తేజ్ మరియు విలక్షణ దర్శకుడు క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కంచె మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమాతో హీరోగా వరుణ్ తేజ్ కు మంచి గుర్తింపు దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Pragya Jaishwal New Photos Goes Viral, Pragya Jaishwal , Akhanda , Bala Krishna-TeluguStop.com

అదే సమయంలో దర్శకుడు క్రిష్ కి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.తక్కువ సమయంలో అంత పెద్ద సినిమా సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో క్రిష్‌ చేశాడంటూ సినీ విశ్లేషకులు అభినందనలతో ముంచెత్తారు.

అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా ప్రశంసలు దక్కాయి.ఆ పాత్రకు తగ్గట్లుగా యువరాణి పాత్రలో అందమైన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకునే మాట తీరుతో నటనతో ఆమె పాత్రకు జీవం పోసింది అంటూ విమర్శకుల ప్రశంసలు కురిపించారు.

ప్రశంసలతో కచ్చితంగా ఆమెకు టాలీవుడ్లో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు.అయితే అందంగా ఉన్నా మంచి నటన కనబర్చినా కూడా ప్రగ్యాకు మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు అవకాశాలు రాలేదు.

కంచె సినిమా విడుదల అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.కంచె సినిమా సక్సెస్ అయినా ఆమె పాత్రకి గుర్తింపు వచ్చినా ఆమెకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చినా అవకాశాలు చాలా అరుదుగా వచ్చాయి.

వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయి అందుకు ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Akhanda, Bala Krishna, Boyapati, Kanche, Tollywood, Varun Teja-Movie

ఆ సినిమాలో నటించడంతో పాటు మంచి పాత్ర కూడా దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ఈసారి ఖచ్చితంగా బిజీ అవుతుందని అంతా భావించారు.కానీ సినిమా విడుదల అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆమె తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు.ఇంత అందంగా ఉన్నా కూడా ఎందుకు ఆఫర్లు రావట్లేదు అంటూ కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో స్టార్ హీరోయిన్లతో పోటీ పడి సినిమాల విషయంలో మాత్రం అదృష్టం కలిసి రాకపోవడంతో వారితో పోటీ పడలేక పోతుంది.

టాలీవుడ్‌ లో ఎంతో మంది హీరోయిన్లతో పోలిస్తే ప్రగ్యా జైస్వాల్‌ చాలా అందంగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube