మహిళా డాక్టర్ పై వైద్యాధికారి లైంగిక వేధింపులు...!

సూర్యాపేట జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది.తనను గత కొంత కాలంగా సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ మరియు అసంక్రిమిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన మహిళ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 Female Doctor Assaulted By Medical Officer, Female Doctor , Doctor Assaulted ,me-TeluguStop.com

ఈ విషయమై సూర్యాపేట టౌన్ పోలీసులను వివరణ కోరగా సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,ఎన్ సి డి కంట్రోల్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, వయోవృద్దుల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన ఆలన విభాగానికి ప్రోగ్రాం అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,ఆలన విభాగంలో పనిచేసే తనను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తూ,

పని పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఓ మహిళ డాక్టర్ మే 28న ఫిర్యాదు చేసిందని,కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని,ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం అందుబాటులో లేరని టౌన్ ఎస్సై లోకేష్ చెప్పారు.అయితే ఈ విషయంలో మహిళా డాక్టర్ గతంలోనే డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.కేసు నమోదైన నాటి నుండి సదరు వైద్యధికారి అందుబాటులో లేకపోవడంతో శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు,జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు, డిఎంహెచ్ఓ కోట చలంకు నోటీసులు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube