రైతులు అధ్తెర్యపడవద్దు అన్నీ కొంటాం:ప్రభుత్వ విప్ బీర్ల

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Aleru MLA Birla Ailaiah) అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆలేరులోని మల్లికార్జున రైస్ మిల్లును శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Don't Worry Farmers, We Will Buy Everything Govt Whip Beer,yadadri Bhuvanagiri D-TeluguStop.com

ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోదాములు పరిశీలించి సివిల్ సప్లై అధికారులను ప్రస్తుత పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారంతో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు రోడ్డు ఎక్కుతున్నారని,గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసిన యాసంగి వడ్లు ఇప్పటికీ గోదాముల్లో పెండింగ్‌లో వుండడం వల్ల స్టాక్ ఎక్కవగా ఉండడంతో అన్లోడ్ చేసుకోవడంలో కొంత అసౌకర్యం కలిగినప్పటికి ఎప్పటికప్పుడు కలెక్టర్, జేసిలతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలుగకుండా చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొనుగోలు చేశామని,ఇంకో 10 లక్షల టన్నులు మాత్రమే వున్నాయని,తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం కొంటుదని రైతులకు భరోసా ఇచ్చారు.అనంతరం విద్యుత్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరెంటు షాటేజ్ ఏమైనా వుందా? ర్తెతులకు ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారు? అని ఆలేరు( Aleru ) మండల విద్యుత్ ఏఈని అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం విద్యుత్ ట్రాన్సఫార్మల చుట్టూ కరెంటు షాక్ రాకుండా ప్లాస్టిక్ కంచెలు ఏర్పాటు చేయించాలని,వెంటనే ఐరన్ స్థంభాలు తొలగించి సిమెంట్ స్థంభాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపిలు గందమల్ల అశోక్,చీర శ్రీశ్తెలం,ఎంఏ ఎజాజ్, ఇల్లెందు మల్లేష్ (Gandamalla Ashok, Cheera Srisailam, MA Ejaz, Illendu Mallesh) ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube