సూర్యాపేట జిల్లా: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సూచించారు.
గురువారం కలెక్టరేట్ నందు అన్ని శాఖల అధికారులతో కార్యాలయాల పరిశుభ్రత,ఫైళ్ల నిర్వహణపై శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ పలు కార్యాలయాలను తనిఖీ చేసి,ఆయా శాఖలకు పరిశుభ్రతపై సూచనలు ఇవ్వడం జరిగిందని,అలాగే మరి కొన్ని కార్యాలయాలు పరిశీలించడం జరుగుతుందని,కలెక్టర్ సూచనల మేరకు కార్యాలయాలలో పనికిరాని పాత ఫర్నిచర్,అవసరంలేని పాత ఫైళ్లను నిబంధనల మేరకు తొలగించాలని,ఎప్పటికప్పుడు అన్ని కార్యాలయాలు పరిశుభ్రతతో అందుబాటులో ఉంచాలని లేనియెడల ఆయా శాఖల అధికారులు సంజాయిషీ ఇవ్వవలసి వస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో డి.ఏ.ఓ రామారావు నాయక్,పి.డి.ఐసీడీఎస్ జ్యోతిపద్మ,జి.ఎం.పరిశ్రమలు తిరుపతయ్య,ఉద్యానవన అధికారి శ్రీధర్,సంక్షేమ అధికారులు శంకర్,శిరీష,దయానంద రాణి,అనసూర్య,ఏ.ఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.