కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
తరువాత బేగంపేట నుంచి ప్రియాంక గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ కు బయలుదేరారు.కాగా కాసేపటిలో సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ ప్రారంభంకానుంది.
ఈ సభలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ ముందుగా వివిధ కారణాలతో మరణించిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా అందించనున్నారు.అనంతరం యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.







