ముంబై అనగానే టక్కున గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ ఇల్లు.కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ అద్భుత రాజమందిరం లాంటి ఇల్లును కట్టుకున్నాడు ఈ కార్పొరేట్ దిగ్గజం.
అయితే ఆయన స్థాయిలో కాకపోయినా.పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన భవంతులు కట్టుకున్నారు.ఇంతకీ ఆయా నటీనటుల విలాస భవనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బీ అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు బంగ్లాలు ఉన్నాయి.అయితే ప్రతీక్ష అనే బిల్డింగ్‌లోనే అమితాబ్ ఎక్కువకాలం ఉన్నాడు.ఆ తర్వాత జల్సా అనే మరో భవనానికి మారాడు.
ఈ భవనాన్ని షోలే సినిమా తీసిని దర్శకుడు రమేష్ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చాడు.దీని విలువ 50 కోట్లు.
సల్మాన్ ఖాన్
బాలీవుడ్ మరో టాప్ హీరో సల్మాన్ కు ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న గెలాక్సీ అపార్ట్ మెంట్‌లో రెండు 2 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి.ఒక్కో దాని ఖరీదు రూ.16 కోట్లు.
సైఫ్ అలీ ఖాన్
ఈయనకు తన వంశ పారంపర్యంగా వచ్చిన ప్యాలెస్ హర్యానాలో ఉంది.దాన్ని 1800వ సంవత్సరంలో కట్టారు.అటు ముంబైలో 70 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఉంది.
జాన్ అబ్రహాం
విల్లా ఇన్ ది స్కై అపార్ట్ మెంట్‌లో జాన్‌కు ఒక పెంట్ హౌస్ ఉంది.ఈ పెంట్ హౌజ్ ఖరీదు రూ.60 కోట్లు.
అమీర్ ఖాన్
బాంద్రా వెస్ట్ లో అమీర్ ఖాన్‌కు 4 బీహెచ్‌కే అపార్ట్ మెంట్ ఉంది.దాని విలువ రూ.60 కోట్లు ఉంటుంది.
అక్షయ్ కుమార్
ముంబై ప్రైమ్ బీచ్‌లో అక్షయ్‌కి బంగ్లా ఉంది.దాని విలువ రూ.80 కోట్ల పైనే ఉంటుంది.
శిల్పాశెట్టి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి జుహులో అరేబియా సముద్రానికి ఎదురుగా ఓ బంగ్లా ఉంది.దాని ఖరీదు రూ.100 కోట్లు ఉంటుంది.
షారుఖ్‌ఖాన్
షారుఖ్ ఖాన్‌కు మన్నత్ అనే రూ.200 కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది.