పలుచటి జుట్టు తో బాధపడుతున్న పురుషుల్లో మీరు ఉన్నారా? అయితే ఈ ఆయిల్ మీ కోసమే!

స్త్రీలే కాదు పురుషులు సైతం పల్చటి జుట్టుతో తీవ్రంగా మదన పడుతుంటారు.జుట్టు పలచగా మారే కొద్ది ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని తెగ హైరానా పడిపోతుంటారు.

 This Oil Helps Thin Hair Become Thicker In Men! Thin Hair, Thick Hair, Hair Care-TeluguStop.com

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వారంలో కేవలం రెండు సార్లు వాడితే పలుచగా ఉన్న మీ జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ఆయిల్ ( Hair oil )ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయను( onion ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, గుప్పెడు మెంతాకు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు( Ginger slices ), రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి .మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తల‌ స్నానం చేయాలి.పల్చటి జుట్టుతో బాధపడుతున్న పురుషులు ఈ హోమ్ మేడ్‌ హెయిర్ ఆయిల్ ను కేవలం వారంలో రెండు సార్లు వాడితే కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా మారుతుంది.హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.

దీంతో బట్టతలకు దూరంగా ఉండవచ్చు.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube