జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం

సూర్యాపేట జిల్లా:అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట జిల్లా(Suryapet ) అనంతగిరి మండల ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి (Garidepalli Murali )మాట్లాడుతూ మీడియా రంగంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఇబ్బందులు పడుతున్నారని,ప్రజా సేవలో నిమగ్నమవుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

 Petition To Mla For Housing For Journalists-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు అనంతగిరి మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్( Bollam Mallaiah Yadav ) స్థానిక తహసిల్దార్ కు చరవాణి ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు భూ పరిశీలన చేసి త్వరగతిన పట్టాలు వచ్చే విధంగా చొరవ చూపాలన్నారు.

ఈ సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube