సూర్యాపేట జిల్లా: కోదాడ నుండి సింబల్ లేకుండా,స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేయటానికి కోదాడ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటున్న జలగం సుధీర్ సీఈసీ అనుమతి కోరారు.75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఎలక్షన్స్ గుర్తుల మీద ఆధారపడి పోటిచేయటం బాధాకరమని,తొలినాల్లల్లో అక్షరాస్యత అత్యల్పంగా ఉన్నకాలంలో ఈ గుర్తులు కేటాయించటం జరిగింది.కాని,ప్రస్తుతం కొన్ని సర్వేల ప్రకారం దేశంలో 72% మంది మహిళలు, 84% మంది పురుషులు అక్షరాస్యులుగా ఉన్నారు.1968 లో వచ్చిన గుర్తుల విధానం ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాన పార్టీలకు గుర్తులు ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉండి మంచి వాల్లైనప్పటికి స్వతంత్ర అభ్యర్దులకు గుర్తుల ప్రచారానికి తగిన సమయం దొరకపోవటం కూడా ప్రజల్లో చర్చ ఉన్నదన్నారు.నవంబర్ 30 న కోదాడ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేస్తున్న క్రమంలో ఎటువంటి గుర్తు కేటాయించకుండా కేవలం పేరు,ఫోటొతో మాత్రమే ఎలక్షన్ ప్రక్రియలో ఉండటానికి తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సుధీర్ ఎలక్షన్ కమీషనర్ ని కోరారు.
ఈ మేరకు ఎలక్షన్ కమీషన్ కు ఈమైల్ ద్వారా విజ్ఞాపన చేసారు.ఎలక్షన్ కమీషన్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి మరి.