పల్లె ప్రగతితో గ్రామాల్లో కొత్త శోభ

గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలి.గ్రామంలో కలియ తిరిగి గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా.

 New Charm In The Villages With Rural Progress-TeluguStop.com

సూర్యాపేట జిల్లా:గ్రామాభివృద్దే దేశాభివృద్దని గ్రామ ప్రజలు పల్లె ప్రగతిలో పాల్గొని గ్రామాలను అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు.బుధవారం ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి,అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి ఆయన పాల్గొన్నారు.గ్రామంలో పలు అభివృద్ధి పనులలో భాగంగా పల్లె ప్రకృతి వనం,క్రీడా ప్రాంగణం,నర్సరీ, డంపింగ్ యార్డు,వైకుంఠ ధామాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు.

అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు.పల్లె ప్రగతి 2019 న ప్రారంభించిన నాటి నుండి పల్లెలలో అభివృద్ధి ఎంతో కనబడుతోందని,గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు.

గ్రామాలలో పరిశ్యుద్ద్యం పచ్చదనాన్ని పెంపొందించడానికి అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో పారదర్శకత తీసుకరావడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 2019 నుండి పల్లె ప్రగతి ప్రారంభించినట్లు తెలిపారు.తెలంగాణ ఆవిర్భావం ముందు పంచాయతీ శాఖకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కు నిధులు మంజూరయ్యేవికాదని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ లకు సమానంగా ప్రతి నెల నిధులను విడుదల చెయ్యడంతో గ్రామాలలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో చేపట్టవల్సిన పనుల విధివిధానాలు,అమలులో అన్ని గ్రామాలు,పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.పంచాయతీ రాజ్ కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు భాద్యతలు పెరిగాయని అన్నారు.

అలాగే గ్రామంలో చేసే ప్రతి అభివృద్ధి కార్యాక్రమంలో అందరిని భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.గ్రామాలలో నాటిన మొక్కలు 80శాతం సంరక్షించాలని లేకపోతే ఆయా గ్రామ సర్పంచ్ లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో 9300 మంది సెక్రటరీలను నియమించడంతో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ సెక్రెటరీలను నియమించి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిందన్నారు.జిల్లాలో ఏ కారణం చేత అయిన ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ పోస్టులను జిల్లా కలెక్టర్ లకే పూర్తి అధికారాలు కల్పించామని వెల్లడించారు.

గతంలో ఇంటి బయట చెత్త వేయడంతో గ్రామాలలో వ్యాధులతో ప్రజలు సతమతమవ్వేవారని ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలలో వ్యాధులు లేకుండా పోయాయని,ఇందుకు ఉదాహరణ రాష్ట్రంలో 90 శాతం వ్యాధులు లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ధ్రువీకరణతో నిరూపితమైందని పేర్కొన్నారు.వాడి పడేసిన చెత్తతో కూడా గ్రామ పంచాయతీలలో ఆదాయం సమకూర్చేందుకు వర్మీ కంపోస్టు, ఎరువులను నర్సరీలకు అందించి గ్రామ పంచాయతీ లకు ఆదాయం తెస్తున్నామన్నారు.

గ్రామంలో తడి,పొడి చెత్త సేకరణపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు.గ్రామీణ యువత క్రీడాభివృద్ధికి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.

గ్రామాల అభివృద్ధి ఒక ఉద్యమంలా సాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గ్రామాలలో వర్మీ కంపోస్టు నర్సరీలకు మాత్రమే కాకుండా రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు.

గ్రామ పంచాయతీ నిధులతోనే ట్రాక్టర్,ట్యాంకర్,ట్రాలీ కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్,జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలలో మార్పు కొరకు జిల్లా యంత్రాంగం కృషి చేసిందని అన్నారు.

అన్ని నర్సరీలలో కోటికి పైగా మొక్కలను అందుబాటులో ఉంచాలని 8వ విడత హరితహారంలో 85లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.ఇరిగేషన్ భూములలో 40లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామాలను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకున్నామన్నారు.మరుగుదొడ్ల ఉపయోగంపై ఐకేపీ సిబ్బంది ద్వారా గ్రామంలో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో అటవీ శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.అనంతరం మహిళ సంఘాలకు స్త్రీ నిధి బ్యాంక్ చెక్కులను అందజేశారు.

ఈ కార్యాక్రమంలో జెడ్పి సీఈఓ సురేష్,డిపిఓ యాదయ్య,డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్,ఎంపీపీ మర్ల స్వర్ణలత రెడ్డి,సర్పంచ్ రజిత సుధాకర్,ఎంపీడీఓ మల్సూర్,ఎంపీవో సంజీవయ్య,తహశీల్ధార్ హేమ మాలిని,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube