యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు చేస్తామని, ధాన్యాన్ని కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,రైతులు పాల్గొన్నారు.