మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ‘దర్జా’ రెండో పాట విడుదల

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’.సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇటీవలే ఆవిష్కరించారు.అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి.

 Mega Producer Allu Arvind Has Released The Second Song In Darja , Allu Arvind-TeluguStop.com

తాజాగా చిత్రంలోని రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.దర్జా’ చిత్రంలోని రెండో పాటను విడుదల చేయడం జరిగింది.పాట చాలా బాగుంది.

ఈ పాట చూస్తుంటే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది.చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్.

ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, ప్లేబాక్ సింగర్ మౌష్మి నేహా,రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.

మా ‘దర్జా’ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.ఇటీవల టీజర్‌ని నిర్మాత సురేష్ బాబుగారు, ఫస్ట్ సింగిల్‌ని దర్శకేంద్రులు కె.

రాఘవేంద్రరావుగారు విడుదల చేశారు.ఈ సందర్భంగా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.త్వరలోనే ‘దర్జా’ విడుదల వివరాలను తెలియజేస్తాము.

’’ అని అన్నారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి.

కెమెరా: దర్శన్, సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, కథ: నజీర్, మాటలు: పి.రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ, స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ, పీఆర్ఓ: బి.వీరబాబు, కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి, నిర్మాత: శివశంకర్ పైడిపాటి, స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube