పట్టణ అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి

సూర్యాపేట పట్టణ ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములై పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల.జగదీష్ రెడ్డి అన్నారు.

 Public Representatives Should Be Involved In Urban Development , Guntakandla.jag-TeluguStop.com

సోమవారం స్థానిక రవి కన్వెన్షన్ హాల్లో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… సూర్యాపేట మున్సిపాలిటీ సొంతంగా నిధులు సమకూర్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు.ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి పనులు నిర్వహించుకోవాలని సూచించారు.

మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులవిషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు సహకరించి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు అయ్యేలా చూడాలన్నారు.మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు పోయిన సమయంలో ప్రజాప్రతినిధులు ఎలాంటి ఫోన్లు చేయకుండా అవసరమైతే ఇంటి యజమానులతో పన్నులు కట్టించే ప్రయత్నం చేయాలన్నారు.

పదేండ్ల కిందటికీ ఇప్పటికీ సూర్యాపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.పట్టణంలో రెండు మినీ ట్యాంక్ బండ్లు,మెడికల్ కళాశాల,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా మారాయన్నారు.

మున్సిపాలిటీకి సంబంధించి 2022-23 సంవత్సర సవరణ అంచనా మరియు 2023 -24 ఆర్థిక సంవత్సరానికి 142 కోట్ల 2 లక్షల 25వేల రూపాయల బడ్జెట్ ను మున్సిపల్ కౌన్సిల్ ఎదుట ప్రవేశపెట్టగా,కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు.మున్సిపల్ సాధారణ నిధుల కింద 39 కోట్ల 32 లక్షలు,గ్రాండ్ల రూపంలో 98 కోట్ల 20 లక్షలు రావచ్చని అంచనా వేయడం జరిగిందన్నారు.

ఇందులో వివిధ పన్నుల రూపంలో 19 కోట్ల 24 లక్షలు,ఇతర పన్నులు అద్దెల ద్వారా 20 కోట్ల 8 లక్షల 25వేలు,రుణాల ద్వారా 3కోట్ల 90 లక్షల రూపాయలు,నాన్ ప్లాన్ నిధుల కింద 19 కోట్లు, ప్లాన్ నిధుల ద్వారా 14 కోట్ల 30 లక్షలు,ఇతర నిధులు 65 కోట్ల 50 లక్షలు మొత్తం 142 కోట్ల 2 లక్షల 25 రానున్నట్లు అంచనా వేశారు.ఈ బడ్జెట్ కింద సిబ్బంది వేతనాలకు 14 కోట్ల 50 లక్షలు, పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు 4కోట్ల 66 లక్షలు,విద్యుత్ ఛార్జీల కింద 3కోట్ల 13 లక్షలు, రుణాల చెల్లింపుకు రెండు కోట్ల రూపాయలు, మున్సిపల్ గ్రీన్ బడ్జెట్ కింద 3కోట్ల 93 లక్షల ఇరవై మూడు వేల రూపాయలు,ఇంజనీరింగ్ విభాగం నిర్వహణకు నాలుగు కోట్ల 26 లక్షలు, సాధారణ పరిపాలన వ్యయం కింద 168 లక్షల 50 వేలు,పట్టణ ప్రాణాలిక విభాగం కోసం 36 లక్షలు, చార్టెడ్ మొత్తం వ్యయం కింద 35 కోట్ల 2 లక్షల 73వేలు చూపించారు.గతంలో మునిసిపల్ బ్యాలెన్స్ నిధులు కోటి 60 లక్షలు,ప్రజల సౌకర్యాలకు 77 లక్షలు,అభివృద్ధి పనుల కింద రెండు కోట్ల 42 లక్షల 52వేలు మొత్తం నాలుగు కోట్ల 79 లక్షల 52వేలు అభివృద్ధి వ్యయం కింద చూపించారు.2023 – 24 ఖర్చు కింద మొత్తం 3 9 కోట్ల 32 లక్షలు ప్రాధాన్య పరిపాలన నిర్వహణలో భాగంగా,గ్రాండ్ల రూపంలో వచ్చే అంచనా నిధులు క్రింద 98 కోట్ల 80 లక్షలను వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనా వేశారు.ఇట్టి బడ్జెట్ ను కౌన్సిల్ ఏక గ్రీవంగా ఆమోదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube